![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -381 లో.. రామ్ కోసం రామలక్ష్మి మెడలో తాళి కడతాడు సీతాకాంత్. వాళ్ళు పెళ్లి చేసుకొని రావడంతో శ్రీలత షాక్ అవుతుంది. ఏంట్రా ఇలా చేసావని శ్రీలత అంటుంది. రామ్ దగ్గరికి వెళ్తాడు సీతాకాంత్. అత్తయ్య, మావయ్య అంటూ సీతాకాంత్, రామలక్ష్మిలని రామ్ పిలుస్తాడు. నాకు ఇలా ఏం కాదు.. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని రామ్ అంటాడు.
ఇక బాబుకి ఆపరేషన్ చెయ్యండి అని సీతాకాంత్ చెప్తాడు. బాబుకి ఆపరేషన్ జరుగుతుంటే మరొకపక్క ఆ మైథిలీని ఎందుకు పెళ్లి చేసుకున్నావని శ్రీలత గొడవ పెడుతుంది. ఇందులో మైథిలీ తప్పేం లేదు తప్పంతా నాదే.. బలవంతంగా తన మెడలో తాళి కట్టానని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత రామ్ ఆపరేషన్ సక్సెస్.. ఇక డిశ్చార్జ్ చేస్తాం తీసుకొని వెళ్ళండి అని డాక్టర్ చెప్తాడు. రామ్ ఇంటికి వచ్చాక రామలక్ష్మి సీతాకాంత్ లతో రామ్ మాట్లాడతాడు. అసలు సీతా అన్నయ్య ఎందుకు ఇలా చేసాడని శ్రీలతతో సందీప్ అంటాడు. ఒకవేళ రామ్ గురించి అలోచించి చేసిందంటే.. ఇంత తక్కువ పరిచయంలో తన జీవితాన్ని త్యాగం చేస్తుందా అని శ్రీలత అంటుంది. ఒకవేళ తను రామలక్ష్మి అయి ఉండొచ్చని శ్రీవల్లి అంటుంది. పిచ్చి పిచ్చిగా వాగకు అని సందీప్ అంటాడు.
మరుసటి రోజు స్వామిని కలవడానికి రామలక్ష్మి వెళ్తుంది. ఇకనైనా నా భర్తతో కలిసి ఉండాలి. ఈ ప్రాబ్లమ్ రాకూడదని రామలక్ష్మి మాట్లాడుతుంటే.. సందీప్ కిటికీలో నుండి చూస్తాడు. ఆ మాటలు విని మైథిలీ, రామలక్ష్మి ఒకరేనా అని సందీప్ షాక్ అవుతాడు. ఆ విషయం వెంటనే శ్రీలత దగ్గరికి వచ్చి చెప్తాడు సందీప్. ఇక నేను ఎవరి మాట వినను.. రామలక్ష్మి, సీతా అన్నయ్యని లేపేస్తానని సందీప్ అంటాడు. సీతాకాంత్ ని వద్దు.. వాడు ఎప్పుడు మనల్ని వదులుకోడు అని శ్రీలత అంటుంది. ఇప్పటివరకు నువ్వు చెప్పింది చేసాను. ఇక నేను చెప్పింది చెయ్ అని శ్రీలతతో సందీప్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |